May 30, 2020

డెబ్బై ఎనిమిది వసంతాల బాలుడు ఈ బుర్రిపాలెం బుల్లోడు......(KRISHNA - A TRIBUTE)

వైవిధ్యమైన పాత్రలలో నటించిన నటశేఖరుడు.... 
తెలుగు చిత్రరంగానికి కొత్త రంగులు అద్దిన చిత్రశేఖరుడు.... 

తెలుగు చిత్రసీమకే రాజశేఖరుడు.... 

డెబ్బై ఎనిమిది వసంతాల బాలుడు ఈ బుర్రిపాలెం బుల్లోడు.... 


సాహసాలకు పెట్టింది పేరు... 

తను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టని ధీరుడు... 

నటశేఖరుడు, ఆంధ్ర జేమ్స్‌బాండ్‌, సూపర్‌స్టార్‌ బిరుదులతో పాటు డాక్టరేట్ వచ్చినా ఆయన హీరో కృష్ణగానే ప్రసిద్దుడు... 
సినిమా ప్రపంచంలో ఎవరినైనా ఫలానా అని ఇంటిపేరుతోగాని, అసలు పేరుతోగాని పిలుస్తారు. ఆయనకు మాత్రం హీరో అనేది ఇంటిపేరయ్యింది.... 

ఆయనే ఘట్టమనేని శివరామకృష్ణ......




ఆయన జీవితచరిత్రకు ఇదో అక్షరరూపం..... 

కాలం కలిసి వచ్చిన వాడికి తొందరగా విజయం వస్తుంది…. 

కష్టపడే వాడికి ఆలస్యంగా విజయం వస్తుంది..... 

ఎందుకంటే.... 

గేదకి గడ్డి దొరికినంత తేలికగా….   సింహానికి జింక దొరకదు..... 

ప్రతీ మనిషికీ జీవితంలోను మిట్టపల్లాలుంటాయి, సుఖదుఃఖాలుంటాయి. ఆయన జీవితంలోనూ వున్నాయి... 

కష్టపడి వాటిని సాహసంగా ఎదుర్కొని దానినే తనకు మారుపేరుగా మార్చుకున్నారు... 





కృష్ణకు మారుపేరు సాహసం అని అనిపించుకుని నటశిఖరాలని అధిరోహించి నటశేఖరుడుగా, సూపర్‌స్టార్‌గా, నిర్మాతగా, దర్శకుడుగా, ఎడిటర్‌గా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా జీవితంలో ఎన్నో పాత్రలను పోషించడమేకాకుండా, సినిమాస్కోప్‌ లాంటి ఎన్నో కొత్త సాంకేతికతలను తెలుగు సినిమా రంగుల ప్రపంచానికి పరిచయం చేశారు... 

ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించారు, తెలుగు, హిందీ భాషల్లో దర్శకత్వం వహించారు. 360 సినిమాలలో నటించారు (హీరోగా 340సినిమాలు). ఒక నటుడిగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోకుండా సినిమా మొదలు నుండి తుది వరకు నిర్మాతకు అండగావుండే ధర్మశీలి... 




అటువంటి మహామనిషి జన్మదినము... 

అభిమానులకు మరుపురాని పండగదినము.....  31 మే...... 

1943 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా నటశేఖరుడు జన్మించారు..... 

ఆయనది రైతు కుటుంబం తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించారు...... 


చిన్నతనం నుంచి ఆయనకు ఎన్.టి. రామారావు అభిమాన నటులు, పాతాళ భైరవి అభిమాన చిత్రం….. 

కృష్ణ తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరును చేయాలన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. సీటు కోసం ప్రయత్నించి, గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎం.పి.సి. గ్రూపులో ఇంటర్ చేరారు. అక్కడ మూడు నెలలే చదివి, ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారారు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివారు... 


సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ…. తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్లు, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నారని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నారు..... 


డిగ్రీ పూర్తిచేశాకా ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది... 






కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది. 1965 నాటికే పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టారు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.... రమేష్ బాబు, పద్మజ, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని..... 

కృష్ణ 1970లు, 1980ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందారు... 
1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి... 




ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు... 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశారు. 1983లో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు. 


సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగు చిత్రసీమలో కొత్త సాంకేతికతలు పరిచయం చేసి టాలీవుడ్ కి దిక్సూచిగా నిలిచాయి. 

తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116)..... 
తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు)..... 
తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు)... 
తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది. 




1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసారు.... 


ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించారు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఆనాడు ఉండేవి. ఆయన అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా బస్సుల్లో తరలివెళ్ళారు. ఆయనకి ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. 




1984 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించిన కృష్ణ 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొంది భారత పార్లమెంటులోకి అడుగు పెట్టారు.... 






అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం కృష్ణ అందుకున్నారు... ఆయన సినీజీవితంలో కమర్షియల్ విజయాలు మాత్రం లెక్కకు మిక్కిలి.... 

అంతేకాక తెలుగు సినిమా రంగంలో పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, పలు విభిన్నమైన ప్రయోగాలు చేయడం వంటివి తెలుగు చలన చిత్ర రంగంలో కృష్ణ స్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.... 


ఆయనకు మరో అరుదైన గౌరవం ఏంటంటే..... ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది.... 




1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ "నటశేఖర" బిరుదును అందుకున్నారు... 

నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నారు.... క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవారు... 


1972లో ఆంధ్రప్రదేశ్‌లో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలా సాయాన్ని అందించేందుకు కృష్ణ విరాళాల సేకరణ కార్యక్రమాలు రూపొందించారు... 


కరువు బాధితుల సహాయ నిధికి సినిమా తారల యాత్ర పేరుతో 1972 అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్‌లలో తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టి కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన డబ్బును సహాయ నిధికి అందించారు.... 






సినీ జీవితంలోనే కాకుండా... 

నిజ జీవితంలోను తన వ్యక్తిత్వంతో హీరో అనిపించుకున్న డెబ్బై వసంతాల బాలుడు ఈ బుర్రిపాలెం బుల్లోడి మరిన్ని జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా జరుపుకోవాలి.... 


  మీ భవదీయుడు.....
  









వై వి సుబ్రమణ్యం, మచిలీపట్టణం.

May 29, 2020

LIFE AND GENIUS OF JANE AUSTEN

Life and Genius of Jane Austen 



Jane Austen was a Georgian era author, and was well known for novels that dramatized what people would call a seemingly boring daily life. She would do it with deep, and fully clear observation of the primary motivations of each character, and she would put them in normal social situations, with regular pressures and how the central character, usually women and men of strength and character, themselves resolve their conflicts with the world, and interestingly, within themselves too. 

The novels show a seamless integration of romance and realistic situations of life. In a strange way, they elevate life, from the surface to a higher level of soul, and value conflicts and the deep pursuit of happiness. 

Early Life 

Jane Austen was the seventh child and second daughter of Cassandra and George sausten. She was born on December 16, 1775, in Steventon, Hampshire, England. 

Her parents were well respected in the community and her father was a rector. Her father was very learned and well educated and with great love for books and original, independent thinking. 

This he also encouraged fully, at home, and al the children, especially Jane benefited obviously from such daily dose of reading, discussions and enjoyment and also intimacy in the family. 

It was a very healthy upbringing, private but very eventful, in terms of imaginative reading, thinking, being expressive and growing prodigiously. 

Not only this, Jane’s father sent his children to a good school. His view was that children, even girls, should get the best academic input, and their thinking, imagination and knowledge should be broad and comprehensive. They learnt the subjects well, and Jane even wrote on History later, and developed a fertile imagination and expression in the written language. 

Unfortunately, due to unrest and also financial constraints, Jane had to leave school. But, she continued to read, and read out to her family members, after she was home. 

As you can see, she was homely and yet, she was mentally very active, and this trait of hers continued all her life. 

The foundation, as it were, could not remain still, it grew in leaps and bounds, and resulted finally in around a dozen masterpieces of literature, signaling a new way in which stories could be told. 

It was a strange story of a woman, who, just from home, became a celebrated thinker and writer in England, though this happened after her death. 

AUSTEN’S JUVENILIA AND HONING OF WRITING SKILLS AND HER LATER MASTER PIECES 

Jane learnt writing by writing itself. She started ambitiously and put her best and in the beginning, wrote many books, though now the world calls them her JUVENILIA. 

She did have an imagination, and was always hard at work, with a fertile creation of characters, words and situations and with great delight. This is the way she became slowly, extremely talented and that too in a very natively original way. 

She always had a ready audience at home. She read aloud books, and usually written by her own self, to her intelligent, eager and sensitive family members. 

By her thirties, she had almost perfected her unique style of writing stories and she wrote many novels, including Pride and Prejudice, Emma, Sense and sensibility, Persuasion etc. 

They got critical acclaim, but it was not until the beginning of the 20th century, after her death, that the world realized that these were masterpieces. She had an unusual fame. Books of hers were made into movies, and she was voted as 80th in the top 100 celebrated thinkers. She got fan clubs and even today, the world over, her stories have been made into movies and have been watched by millions in many languages too. 

Jane Austen death, tragically, was at a very early age of 43. She got a disease and she left behind a strange story of her own life. 

A simple girl, living largely at home, with no family, who read and wrote and thought out stories all her life, perfected her art AND SIMPLY ACHIEVED WORLD FAME. 

It is a great lesson of how the greatest achievements come from within and not from pomp and show, and flattery, traits that she herself mocked in her novels. 

This was a wise and happy woman, and extremely observant and intelligent, yet a great story teller, not of big scale events, but seeing significance in daily, real, actual, human lives. 

She left that impact and that lesson for posterity, and her works would be examined, studied, and millions would learn and live by applying that basic principle, each in his own way. 

She is a lesson in independence, gender equality and self generated, honed, and applied passion and real living with the highest human faculty of imagination and bringing to life, real world of real people, yet making it all full of meaning, drama and entertainment.

May 28, 2020

LIFE AND GENIUS OF JONATHAN SWIFT


LIFE AND GENIUS OF JONATHAN SWIFT 


Jonathan Swift was a beautifully original writer - serious about ideas, especially politics and the human condition, in love with learning, which to him, was the most natural of all human qualities. 

He was deeply loving, as a person, and also very devotedly romantic, activist to the core, religious in a deeply human sense, and an exceptional writer, imaginative and satirical but with a very real humanity. 

Early life and education 

He was born in Dublin, Ireland. A few months before he was born, his father died. But his mother took great care of him, not just in terms of feeding and bringing him up, but with a determination that, despite her circumstances, her son must get the best of everything. 

His mother was hard up on finances, and she took a wise decision to hand over her son’s education to her brother-in-law, Godwin Swift who was an established attorney. Jonathan was enrolled in Kilkenny Grammar School, which was one of the best schools in Ireland at that time. 

Gulliver had another serious problem. He suffered from Meniere’s disease that affected the inner ear and made Jonathan nauseous and hard of hearing. 

Despite these tough circumstances, Jonathan showed great discipline and made good use of his 8 years in the school, 1674-1682. This foundation of the best learning, that he himself made the best use of, had a lasting influence in his life. 

His deeply original mind, sensitivity and power of learning, got wings and he was able to, with such a foundation and a deep passion kindled within him, spend a lifetime in deep study, He could spend a life time learning from experiences, activism and writing. He also made a deep friendship with the great William Congreve in school. 

He flowered in the ability to make friendships and above all, to endure hardships while still being alive and learning with his faculties in top gear. 

That flame never lessened and he grew in leaps and bounds with every passing decade. 

He filled his life, with learning, study, writing works, activism, and also found a deep and lasting and true romantic love, and great friendships. He lived a rich life and put all his life time observations and experiences into great works of artistic writings. 

Without doubt, all the early school studies, combined with challenging circumstances, MADE his life by providing a great foundation which his innate nature HUNGERED NATURALLY FOR and his good fortune gave him. 

Later Studies Years with William Temple (1684 – 1699) 

At age 14, he enrolled in the famous Trinity College for undergraduate studies, for four years he immersed himself in deep acquaintance with all that could be learnt in the humanities during that time. At 18, he graduated and enrolled in Masters too. But soon, huge unrest came about in Ireland. What is called the Glorious Revolution motivated Swift to move to England. 

Here he got employment as secretary under the famed William Temple. It was his mother who had arranged this position for him. 

This was a very fruitful period for Swift. He honed his writing abilities and Temple soon recognized both his brilliance and sensitivity and gave him the most important and sensitive tasks. He rose in his abilities as a writer and also started writing his own essays and began working on a book that would be published later. 

Temple was an excellent employer in that sense and made full use of Swift’s abilities and also encouraged Swift in all ways, especially to write his own original pieces. 

They were wonderful ten years and another extremely eventful thing that happened to Swift was that he developed a deep and, in fact, strange love for a girl whom he called Stella. Her full name was Esther Johnson. 

The special, strange and beautifully dedicated love affair of Swift with Stella. 

Esther was the daughter of the house keeper at Temple’s household. Esther was only 8 years old, when Swift first met her. He began to mentor her and they developed a deep trust, closeness and actually love for each other. This is evidenced from the fact that he wrote two books inspired by her. She was a kind of muse, and his own soul in another form, who would understand all that he felt, thought and loved. When she grew older, it is said that they did marry, but it is not known with certainty. 

What is certain is that all his life, Swift not only loved Stella, but shared all his soul with her. 

Work as a minister near Dublin (1699- 1709) and with the Tories 

In 1699, Temple passed away and after a few failed trials, here and there, Swift finally settled to become a minister near Dublin, in a small church. 

Here, for the next 10 years, he lived a simple life preaching and living in the small residence that the church provided. 

Now, he had ample inner motivation, space and also time to write his first political pamphlet that was called “Discourse on the contests and dissensions in Athens and Rome”. 

He released 2 books anonymously - The Tale of a Tub, and the Battle of the Books. 

Swift, by now, had matured in every way. He was truly a giant and he could see the pettiness, banality of life, in Church and in Politics and in the whole mankind. 

His deeply sensitive nature and his hard earned erudition and his honesty and humanity made it too clear to him, what the problems of the world really were. In fact, he had risen far above the world, and the only way he could really express the truth and clarity he had was through cutting satire. Nothing else or less would do. 

All his unique gifts came to a laser like focus with his satirical pen. 

His love for life, humanity, definitely kindled and blossomed with Esther. Also developed simultaneously, his contempt with detachment the sick, petty, and trivial life of the people, politics and especially the emptiness of false pride. 

All this he expressed in the The Tub and not surprisingly, it became a huge success as he had had laid out the truth, in satirical fashion and with utter clarity, detachment and full, obvious truth. 

But, as he had chosen to use the church to portray false pride, he got a bad reputation and severe condemnation for the church. 

But indirectly, he was celebrated by the more liberal people and intellectuals and when the Tories came to power, they invited him to join them, and he was made editor of the “Examiner”, a weekly. 

He spent 4 years with them till they came down from power. During that time, he saw politics from close, and saw the world, especially those who craved the worst that life offers- power. 

He could see, with his perspective, the degradation, the utter lack of knowledge, care, concern, and totally insane justifications, and he had no choice but to put it all in his writings for the Tories. 

A large part, however, he wrote in a series to his love, Stella, and it became a book called THE JOURNAL OF STELLA. In that, as was usual with him he poured out his humanity and his observations, with a deep, and deadly perspective. 

'Gulliver's Travels' and final Years at St Patrick’s Cathedral 

Before the inevitable fall of the Tories, Swift returned to Ireland. In 1713, he got a post at St. Patrick's Cathedral in Dublin. 

It was here that all his life’s study, observations, honed skills as a satirical writer, his panoramic and yet close hand, and first hand perspective on life and living and politics culminated in a legendary, eternal work of the greatest art – GULLIVER TRAVELS. 

The book was an immediate success and since then till today, millions of people have read the book, in full, or in abridged form the world over. 

After a few months of the success of that book, Swift's longtime love, Esther Johnson, fell ill. She died in January 1728. He was obviously shattered, and he poured out his deepest feelings and what he had seen and felt and shared with her, in a book called The Death of Mrs. Johnson. 

In 1742, Swift met with a stroke and lost his ability to speak. On October 19, 1745, Swift passed away. 

He was laid to rest next to Esther Johnson inside Dublin's St. Patrick's Cathedral.

May 27, 2020

కలియుగ కథానాయకుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా...... (NTR - A TRIBUTE)

కలియుగ కథానాయకుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా...... 

(28th MAY 1923)

కలియుగ దైవం ఆ ఏడుకొండలవాడైతే....
కలియుగ కథానాయకుడు ఈ తారకుడు....



తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఈయన తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 300 చిత్రాలకు పైగా నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.



విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఈయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయారు.


రంగస్థల నటుడు నుంచి చలనచిత్ర రంగంలోకి వచ్చి తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడుగా ప్రజాధారణ పొందటమే కాకుండా రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు.రాజకీయపార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు.





ఆ తరువాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించి...... తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు నందమూరి తారకరామారావు...

ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు.... కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్రలేదు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన. వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ‘అన్న’ ఎన్టీఆర్. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్....

    




1923 మే 28న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు ఈ కలియుగ కథానాయకుడు జన్మించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తరవాతే ఆయన బి.ఎ. పూర్తిచేశారు. తొలి సంతానం కలిగిన తరవాత ఆయన మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంలో చేరారు. కానీ, ఆ ఉద్యోగం నచ్చక తనకు ఇష్టమైన సినిమాల్లో నటించడానికి మద్రాసు పట్టణానికి బయలుదేరి వెళ్లారు.





తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు... జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా....
గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.

‘ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది..... కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది..... రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది..... నిరుపేదల కన్నీటిలో నుండి.... కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.... ఆశీర్వదించండి’.... అంటూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు.





తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయి. రాజ్యసభ సీటు ఇస్తాం అంటూ రాయబారాలు మొదలయ్యాయి. ‘లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరు’ అనే వివేకానందుడి మాటల్ని ఒంటపట్టించుకున్న.... ‘అన్న’ ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు. ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు...


చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు...






‘రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్’ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.... రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు...


ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది.... ఆయన పలుకు ఓ సంచలనమై విరాజిల్లింది... ఆయన ప్రతి మాట ఓ తూటాగా.... ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడ్డ నటుడు... రాజకీయ నేతగానూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.


ప్రజా జీవితంలో ఎన్టీఆర్
అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు...... తప్పించుకునే ధోరణి.... ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు.



‘పేదవాడే నా దేవుడు.... సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనారు ఎన్టీఆర్.



ఆ నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ....
దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు.... ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.... అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం.....

1982 మార్చి 29 కొత్త పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు....
ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి... పార్టీ ప్రచారానికై తన పాత వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు.... దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు. దానిని ఆయన "చైతన్యరథం" అని అన్నారు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.....
ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు.



చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.


ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నారు.


కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించారు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.





కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు ఎన్టీఆర్ నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.



1983 జనవరి 7 న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది.

అఖిలాండ కోటి బ్రంహాండ నాయకుడు, దేవదేవుడు ఆ శ్రీ రాముడు అయితే.......
అఖిలాండ కోటి బ్రంహాండ కథానాయకుడు, యుగపురుషుడు, తెలుగు జాతి కీర్తి శిఖరం... తెలుగు లెజెండ్....  నందమూరి తారక రామారావు.....





తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు పర్యాయపదం. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడు ఆయన. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు.


తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో మైలురాళ్ళకు యన్టీఆరే ఆద్యుడు. ఇక ఆయన నటజీవితంలో మైలురాళ్ళుగా నిలచిన చిత్రాలు ఈ నాటికీ జనం మదిని గెలుస్తూనే ఉన్నాయి... సాంఘికమైనా, పౌరాణికమైనా, చారిత్రకమైనా, జానపదమైనా- ఏదైనా సరే నందమూరి బాణీ వాటికే వన్నె తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని, పరిపాలనను ప్రజల ముంగిట నిలిపిన ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.


సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా చేస్తోన్న ఎన్‌టిఆర్‌ చెన్నై ట్రైన్‌ ఎక్కేశారు. తొలి అవకాశం 'పల్లెటూరి పిల్ల' సినిమాకు వచ్చినా విడుదలైంది మాత్రం 'మనదేశం' చిత్రం. షావుకారు చిత్రం తరువాత నివాసాన్ని చెన్నై థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతానికి మార్చుకున్నారు. విజయావారి బ్యానర్‌పై వచ్చిన పాతళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌టిఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి.

   




మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత రామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి.


కన్యాశుల్కం, గుండమ్మకథ, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్‌ రాముడు, సర్ధార్‌ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు.


ఎన్‌టిఆర్‌ నటించిన చివరి చిత్రం మేజర్‌ చంద్రకాంత్‌. తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించారు.


చిత్ర సీమలో నెంబర్‌ వన్‌గా నిలిపిన అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని తలిచిన ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం అనే రాజకీయపార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే వటవృక్షం లాంటి కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించి ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేశారు. అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడే కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆయన చేసిన ప్రసంగాలు తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని నిలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.


1984లో సినిమారంగంలో స్లాబ్ విధానాన్ని అమలు పరిచారు.


ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని 1985 జూన్‌1న రద్దు చేసారు.


హైదరాబాదు లోని హుస్సేన్‌ సాగర్ కట్టపై (ట్యాంకు బండ్) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పారు.


ప్రజలే దేవుళ్ళు - సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారు.


స్త్రీలకు ఆస్తి హక్కునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకొని తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. తెలుగుజాతికి - తెలుగుభాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌.


గ్రామీణ జీవితాన్ని ఫ్యూడల్‌ శక్తుల కబంద హస్తాలనుంచి విడిపించేందుకు మునసబు - కరణం వ్యవస్థలను రద్దుపరచి బడుగు - బలహీనవర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గరకు చేర్చారు.


తెలుగుదేశంపార్టీని కేవలం ఒక రాజకీయపార్టీగా కాక ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా ఆయన చెప్పేవారు.


పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం...


సగం ధరకే చేనేత వస్త్రాలు...


రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌...


తదితర ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేసారు.


ఆడిన మాట తప్పని "అన్న" ఎన్‌టిఆర్‌ అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. నాదేండ్ల బాస్కర రావు నుంచి వెన్నుపోటు ఎదుర్కొన్న ఎన్‌టిఆర్‌ మరోసారి ప్రజా తీర్పు కోరి తిరుగులేని మెజార్టీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.


రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన ఎన్‌టిఆర్‌ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యపథంలో నడిపించి నేషనల్‌ ప్రంట్‌ ఏర్పాటు చేశారు. కేంద్రంలో తొలి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయించారు. ఒక ప్రాంతీయ పార్టీని దేశ రాజకీయాలకు దిక్సూచిగా మార్చారు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టకుండా హుందా రాజకీయాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.


1994లో కిలో బియ్యం రెండు రూపాయలు..,


సంపూర్ణ మధ్య నిషేధం.., వంటి హామీలతో, మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు...

అన్న గుండె ఆగిన రోజు.....





ముప్పైమూడేళ్ల వెండితెర జీవితంలో, పదమూడేళ్ల రాజకీయ జీవితంలో నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన మహాపురుషుడు ఎన్టీఆర్.... 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన ఈ భూమి మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో మరపురాని జ్ఞాపకంలా ఇంకా బతికే ఉన్నారు నందమూరి తారకరామారావు...



     మీ భవదీయుడు..... 

 వై వి సుబ్రమణ్యం, మచిలీపట్టణం

RELATIVE VELOCITY- 1 (MASTER ADVANCED PHYSICS)

MASTER ADVANCED PHYSICS
(For all Top Exams)

RELATIVE VELOCITY- 1



Situation - 1 – One dimensional motion of two bodies moving opposite to each other 

When two bodies are moving with velocities v1 and v2 exactly opposite to each other, then a man at the body v1 or v2 will experience a velocity that is v1 + v2. 

This is a common experience when we travel in trains. When a train comes opposite to us, and crosses us, it seems to be going faster than its actual speed. 

Why? 

This is because WE are not stationary. While the other train is crossing us, we too are moving ahead. So, plainly, the velocities get added up by the reality of the situation!! 

Situation – 2 - One dimensional motion of two bodies moving in the same direction to each other

When two bodies are moving with velocities v1 and v2 in the same direction to each other, then a man at the body v1 or v2 will experience a relative velocity that is v1 - v2. 

This is a common experience when we travel in trains. When a train is gong beside us in the same direction as us, it seems to be going slower than its actual speed. 

Why? 

This is because WE are not stationary. While the other train is moving beside us, we too are moving ahead. So, plainly, the velocities get subtracted by the reality of the situation!! 

Situational 3 – Two dimensional motion of two bodies moving at an angle to each other. 

Here we simply take the relative velocity of the two bodies as the vector difference of their velocities, with respect to some origin. 

V (BA) = V(BO) – V(AO)

There are many such examples, and we will see them when we do problems based on relative velocity.


May 26, 2020

VECTORS – 4 (MASTER ADVANCED PHYSICS)

MASTER ADVANCED PHYSICS 

(FOR ALL TOP EXAMS) 



VECTORS – 4 

RESOLUTION OF VECTORS 

It is a good idea to break one vector into what is called rectangular components.

What does this mean?

Suppose you have a 2 dimensional vector and we want to have 2 one dimensional vectors, one on the x axis and the other on the y axis.

These two one dimensional vectors sum up and give the original vector.

So, if we have a vector of 10 units and at 60 degrees to the X axis, then

The component on the X axis is A Cos (theta) and the component of the Y axis is A Sin (theta)

Let us check whether this is true.

WE have seen that R2 = a 2 + b2 + 2ab Cos(theta)= a sin2 (theta) + BCos2(theta) + 2ab Cos(theta)

= 10(Sin2(theta) + Cos2(theta) ) + 0 (as Cos 90 is zero

= 10 which is true...

So, we can break a vector into two components along X axis and along Y axis.

If we have say 10 forces acting on a body, and if we break EACH one into components in X axis and y axis, then finally we will have

10 vectors along x axis

10 vectors along y axis.

Each can be added very simply. As it is one dimensional.

And finally we will have after adding, ONE value of the vector along x axis A and one along y axis B.

So, resultant can be got by

R2 = A2 + B2

R = root of a2 + b2

The final angle would be Tan b/a where b= Y component and a= X component.

So these are the basic concepts and also formulae.

PRODUCT OF VECTORS

Dot product – A DOT B = AB COS (THETA)

Cross product – A CROSS B = AB SIN (THETA)

We will see these concepts by linking to physics in later chapters.