January 20, 2021

వివాహం (MARRIAGE) - ఇద్దరు స్త్రీ పురుషులు కలసి జంటగా నివసించటానికి సమాజం నుండి పొందే లైసెన్సునే వివాహం అంటారు.

వివాహం (MARRIAGE) 

ఆత్మీయులకు ,

వివాహం మనేది మానవ సృష్టి లో ప్రధమ కాలం నుండి కాక పోయినా కూడా అతి ప్రాచీన కాలం నుండి వస్తుంది. మానవుడు ఒంటరి జీవితాన్ని జీవించటంలో ఆనందం పొందలేడు. అందుకే జంట జీవితాన్ని ఏర్పరచుకున్నాడు. 

ఇద్దరు వ్యక్తులు ఒకే లైంగిక జాతికి చెందిన వ్యకుల కంటే, వేరు వేరు లైంగిక జాతికి చెందిన జంటగా ఆనందం పొందగలరు. అందుకే ఇద్దరు పురుషుల మధ్య, ఇద్దరు స్త్రీల మధ్య కాకుండా ఒక పురుషునికి, ఒక స్త్రీకి మధ్య జగుతూ వస్తుంది. సారూప్యాల కంటె వైరుధ్యాల మధ్య ఆకర్షణ అధికం. 

ఇద్దరు స్త్రీ పురుషులు కలసి జంటగా నివసించటానికి సమాజం నుండి పొందే లైసెన్సునే వివాహం అంటారు. 

మనోవిజ్ఞాన పరంగాను, శారీరక విజ్ఞాన పరంగాను కూడా ఏ పురుషుడు సంపూర్ణ పురుషుడు కాదు. ఏ స్త్రీ కూడా సంపూర్ణ స్త్రీ కాదు. ప్రతి పురుషుడిలోను కొంత స్త్రీ భాగం, ప్రతి స్త్రీలోను కొంత పురుష భాగం వుంటుందని వైజ్ఞానికుల నిరూపణ. అందుకే స్త్రీ పురుషుల మధ్య అంత గాఢమైన అవగాహన. ఉభయులు కలసి శారీరకంగాను, మానసికంగాను గాఢ ఐకమత్యతతో ఒకటిగా ఉండాలనే ఆరాటం. 

దాంపత్య జీవితంలో శారీరక కామానికి, మానసిక ప్రేమకూ ఎంతో విడదీయరాని సంబంధం ఉంది. రెండూ సమైక్యమలునప్పుడే దాంపత్య జీవితం ప్రకాశించేది. 

భార్యాభర్తలు ఇస్టాలు, అయిష్టాలు, ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, అభాప్రాయాలు ఒకే విధమైనవిగా వుండనవసరం లేదు. పరస్పరం బేధాభిప్రాయాలు వుండవచ్చు. అయినా పరస్పర బేధాభిప్రాయాలను ఉభయులూ గౌరవించటం నేర్చుకోవాలి. 

మీ వైవాహిక జీవితం మీకే కాక మీ తోటి వారికి కూడా మేలు కలిగించేదిగా ఉండాలని నిరంతర ఆకాంక్ష. మీ వైవాహిక జీవితం శాంతికీ, కాంతికీ నీలానికేతనం కావాలని ఆకాంక్ష. నిత్యజీవితంలోని కష్టసుఖాలను లెక్క చేయక మీ వైవాహిక జీవిత నౌకను రాగంతో అనురాగంతో, జ్యోతిర్మయ పంధాలో నడువుతూ ధన్య జీవులుగా రూపోందాలని మరోసారి హొర్ధిక ఆకాంక్ష. 

ఒకే ఆశై, ఒకే ధ్యాసై, ఒకే శ్వాసై, ఒక్కరే ఇద్దరై, ఇద్దరూ ఒక్కరై, కలిమిలేములు, కస్టసుఖాలు, కలిసి పంచుకుని ప్రేమానురాగాలతో వర్ధిల్లేదే ఏడడుగుల, ఏడేడు జన్మల బంధం. 

పురుషుడు - బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల యొక్క త్రిమూర్తుల దివ్యస్వరూమంలో చూపిన విజయోమ్మఖ పధంలో, విజ్ఞతతో నడవటానికి సిద్ధమైన సిద్ధపురుషుడు. 

స్త్రీ - లక్ష్మి, సరస్వతి, పార్వతిల యెక్క ఏకాత్మతారూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరచే ప్రకృతి యొక్క ప్రేమస్వరూపం. 

ప్రేమ - ప్రేమంటే ఒకే భావ సమ్మేళనం కలిగిన రెండు హృదయాలు, రెండు శరీరాలు కూడా. ఈ ప్రపంచంలో ప్రేమ అత్యుత్తమంగా దోరకటానికి అవకాశముండే చోటు స్త్రీ హృదయం. వాళ్ళ శరీరాన్ని ఊపిరాడకుండా కౌగిలించుకున్నంత మాత్రాన ప్రేమ అనిపించుకోదు, వాళ్ళ హృదయాలను కూడా కౌగిలించుకో గలగాలి. 

ఒక స్త్రీ తన ఆంతరంగాన్ని ఈ విధంగా తెలియజేస్తుంది. నా శరీరాన్ని తాకిన వాళ్ళు హృదయాన్ని తాకలేక పోయారు, హృదయాన్ని తాకిన వాళ్ళు శరీరాన్ని తాకలేక పోయారు. రెండిటినీ తాక గలిగిన వ్యక్తి కోసం నేను కలలు కంటున్నాను అని. అలాంటి వ్యక్తి తారసపడి నా బుగ్గ మీద ముద్దు పెండితె 100 ప్లాస్టిక్ సర్జరీలు చేసినా ఆ తడి ఆరిపోదు అని. 

ఒక సత్ పురుషుడు ఉంటాడు - నా వృదయ సామ్రాజ్యాన్ని పరిపాలించే సౌందర్యంగల, సహృదయంగల స్త్రీ కోసం నేను అన్వేషిస్తున్నానని, ఆమె సౌందర్యం నిరంతరం నా కళ్ళ ముందు మెదలాడుతుంది. ఆమె నా నుంచి దూరమయతే నా కన్నీళ్ళ కడగటానికి 7 సముద్రాల నీళ్ళ నాకు చాలవు అని. 

లైంగిక శక్తి - లైంగిక శక్తే ఈ ప్రపంచంలో వున్న ఏకైకశక్తి. దేముడు కూడా దేన్నయినా సృష్టించాలంటే సెక్సును ఆశ్రయించాల్సిందే. సెక్సు నుంచే జీవం పుడుతుంది. శిశువు జన్మిస్తుంది. పువ్వులు వికసించినా, కోయిలలు రాగాలు తీసినా, నెమలి పురి విప్పి నాట్యం చేసినా అవన్నీ లైంగిక శక్తి సంకేతాలే, ఈ ప్రపంచంలో మీకు ఎటు చూసినా లైంగిక శక్తి సంకేతాలే కనిపిస్తాయి. 

మీ హృదయం ఆనందం, శాంతి, కృతజ్ఞతతో నిండినప్పుడు మాత్రమే లైంగిక క్రియలో పాల్గొనాలి. అలా పాల్గొన్నప్పుడు దివ్య చైతన్యానుభూతి కలుగుతుంది. 

పుట్టుక – స్వేచామయ, ఆహ్లాదకర స్త్రీ-పురుష శృంగార దివైక్య ప్రేమానురాగాల సంయోగంలో నుంచి మంచి ఫరదీకరించే అండం నుంచి కృష్ణుడు, రాముడి, బుద్ధుడు, క్రీస్తు లాంటి వారికి జన్మ ఇవ్వవచ్చు. 

నిరాశ, కోపం, కలతలు, బలవంతం, ఈర్ష్య, అసూయ, అనురాగరాహిత్యం, సామాజిక యాంత్రిక సంయోగంలో నుంచి సంభవించే జననం రావణాసురుడో, కంసుడో, హిట్లరో, మరో విధ్వంశకారో పుట్ట వచ్చు. 

పండితుడి ఇంట పామరుడు, పామరుడి ఇంట పండితుడు అనే సామెత కూడా వున్నది. 

ఏది ఏమైనా ఇది అందరి విషయంలో సత్యం కావచ్చు, కాకపోవచ్చు, కాని కొందరి విషయంలో సత్యమే . 

మీ ఆత్మీయుడు....   కుర్రె రామకృష్ణారెడ్డి